Header Banner

టీ20 క్రికెట్‌లో స‌రికొత్త రికార్డు! కేవ‌లం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్న క‌రేబియ‌న్ స్టార్‌!

  Mon Feb 03, 2025 11:33        Sports

వెస్టిండీస్ ప్లేయ‌ర్ ఆండ్రీ ర‌సెల్ టీ20ల్లో చ‌రిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 9వేల ప‌రుగులు పూర్తి చేసిన ఆట‌గాడిగా స‌రికొత్త రికార్డుకెక్కాడు. ర‌సెల్ కేవ‌లం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకోవ‌డం విశేషం. అంత‌కుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఆట‌గాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (5,915) పేరిట ఉండేది. ప్ర‌స్తుతం యూఏఈలో జ‌రుగుతున్న ఐఎల్‌టీ20 టోర్నీలో ఈ క‌రేబియ‌న్ ఆట‌గాడు ఆడుతున్నాడు. అబుదాబి నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శనివారం నాడు గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను న‌మోదు చేశాడు.

 

ఇంకా చదవండి: సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!

 

వీరిద్ద‌రి త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన వారిలో ఏబీ డివిలియర్స్ (5,985 బంతులు), కీరన్ పొలార్డ్ (5,988 బంతులు), క్రిస్ గేల్ (6,007 బంతులు), అలెక్స్ హేల్స్ (6,175 బంతులు) ఉన్నారు. ఈ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్‌ మొత్తం 536 మ్యాచుల్లో 9,004 పరుగులు చేశాడు. ఓవ‌రాల్‌గా టీ20ల్లో 9వేల ప‌రుగులు పూర్తి చేసిన‌ 25వ ప్లేయ‌ర్ ర‌సెల్ కావ‌డం గ‌మ‌నార్హం. అతని 26.79 సగటు, 169.15 అద్భుత‌మైన‌ స్ట్రైక్ రేట్ తో ఈ జమైకన్ ఆల్ రౌండర్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 31 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు సాధించాడు. ఇక‌ క్రిస్ గేల్ కేవలం 463 మ్యాచుల్లో 14,562 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అటు బౌలింగ్‌లోనూ ఆండ్రీ ర‌సెల్ అద్భుత‌మైన గ‌ణాంకాలు క‌లిగి ఉన్నాడు. అతను తన టీ20 కెరీర్‌లో 25.55 సగటు, 8.71 ఎకానమీతో 466 వికెట్లు తీశాడు.

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్‌ మామూలుగా లేదుగా!

 

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndreRussell #TeamWestIndies #T20cricket #Cricket #SportsNews